వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం

తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో వశిష్ఠ అతిథి గృహం, ఆయుర్వేద కళాశాల అతిథి గృహం, స్విమ్స్ అతిథి గృహాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

వైద్యులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సేవలందించే విధంగా వసతి గృహాల్లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతులను సమృద్ధిగా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్‌ఈలు మనోహరం, వేంకటేశ్వర్లు, ముఖ్య వైద్యాధికారి డాక్టర్ కుసుమ కుమారి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, బర్డ్ సూపరింటెండెంట్ వెంకట రెడ్డి, టీటీడీ , స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘ‌నంగా వీర శైవ లింగాయ‌త్ ధ‌ర్మ సంర‌క్ష‌ణ స‌మ్మేళ‌నం

    బెంగ‌ళూరు : అఖిల భారత వీరశైవ శివాచార్య సంస్థ (రెజి.) , అఖిల భారత వీరశైవ లింగాయత్ మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో బెంగళూరులోని విజయనగరంలో జరిగిన వీరశైవ లింగాయత్ ధర్మ సంరక్షణ సమ్మేళనాన్ని పవిత్ర జగద్గురువు పంచ పీఠాధీశ్వరుల వారి…

    ప్రత్యేక ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి

    తిరుమ‌ల : ప్రత్యేక ప్రతిభావంతులు తమలోని ప్రతిభను గుర్తించి, నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకుని ఆత్మ విశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పాత అన్నప్రసాద భవనంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *