అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో చౌద‌రితో పాటు ఆల‌య అర్చ‌కులు . అనంత‌రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప‌ద్మావ‌తి అమ్మ వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇదిలా ఉండ‌గా అంతకు ముందు జస్టిస్ లీసా గిల్ తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకోగానే సీజేకు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్, ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, శ్రీమతి నాగరత్న, విజిఓ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్ర‌దాన న్యాయ‌మూర్తి రాక సంద‌ర్బంగా భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

  • Related Posts

    శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

    తిరుప‌తి : తిరుపతి జిల్లా సురుటుపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు దంపతులు సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీ పద్మనాభరాజు, కార్యనిర్వహణాధికారి…

    కళల పరిరక్షణకు టీటీడీ నిరంతర ప్రోత్సాహం

    తిరుప‌తి : తిరుపతి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా భారతీయ కళలు, సంస్కృతికి నిలయమని, కళలను పరిరక్షించి ప్రోత్సహించే ప్రతి సంస్థకు టీటీడీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలోని మహతి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *