మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ చిన్ని ఫిర్యాదు

VijayaBhaskar · June 13, 2026
Spread the love

బెజ‌వాడ‌లో తారా స్థాయికి చేరిన అన్న‌ద‌మ్ముల వివాదం

విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లో అన్న‌ద‌మ్ములైన ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నానిల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్ద‌రు ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములు కావ‌డం విశేషం. కానీ రాజ‌కీయ ప‌రంగా ఈ ఇద్ద‌రూ వేర్వేరు పార్టీల‌లో ఉన్నారు. గ‌తంలో ఎంపీగా ఉన్న స‌మ‌యంలో కేశినేని చిన్ని టీడీపీలో ఉండ‌గా ఉన్న‌ట్టుండి వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జ‌గ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో చేరారు. ఇదే క్ర‌మంలో సోద‌రుడు కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చిన్ని గెలుపొందారు. కోలుకోలేని షాక్ తగిలింది కేశినేని నాని.

ఈ త‌రుణంలో ఈ ఇద్ద‌రూ మాట‌ల యుద్దానికి తెర లేపారు. ఒక‌రిపై ఒక‌రు కామెంట్స్ చేసుకుంటూ సంచ‌ల‌నంగా మారారు. నాని, చిన్నిల మ‌ధ్య వివాదం మ‌రింత ముదిరింది. చివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసేంత దాకా వెళ్లింది. మాజీ ఎంపీ కేసీనేని నానిపై ఫిర్యాదు చేశారు విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని. కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలని పటమట పీఎస్ లో ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ ఆరోపించారు.