గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన విద్యారణ్య పీఠాధిపతి

VijayaBhaskar · June 14, 2026
Spread the love

శుక్లాను ఆశీర్వ‌దించిన విరూపాక్ష స్వామీజీ

హైద‌రాబాద్ : హంపి విరూపాక్ష విద్యార‌ణ్య పీఠాధిప‌తి విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ మ‌ర్యాద పూర్వ‌కంగా తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లుసుకున్నారు. హైద‌రాబాద్ లోని లోక్ భ‌వ‌న్ లో చాలా సేపు వీరిద్ద‌రూ వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. స్వామీజీ ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. స్వామీజీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం వ‌ర్గాలు.

ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై గవర్నర్‌తో చర్చించారు విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ. స‌నాత‌న హిందూ ధ‌ర్మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరాక స్వామీజీల హ‌వా కొన‌సాగుతోంది. రాజ్యాంగ బ‌ద్ద‌మైన ప‌ద‌వుల‌లో ఉన్న వారు అన్ని కులాలు, వ‌ర్గాలు, జాతుల ప‌ట్ల స‌మ దృష్టిని క‌లిగి ఉండాల‌ని డాక్ట‌ర్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం చెబుతుంది. అవేవీ ఇక్క‌డ అమ‌లు కావ‌డం లేదు.