టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం

Spread the love

శ్రీ‌వారికి వెల్లువెత్తుతున్న విరాళాలు

తిరుమ‌ల : కోరిన కోరిక‌లు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం నిత్యం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో సామాన్యుల నుంచి బ‌డా బాబుల దాకా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ల‌క్ష‌లాది మంది హుండీలో డ‌బ్బుల‌తో పాటు కానుకలు కూడా స‌మ‌ర్పించు కుంటున్నారు. ఇదిలా ఉండగా భ‌క్తుల‌తో పాటు ప్ర‌ముఖ పేరు పొందిన సంస్థ‌లు, కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, ఇలా ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు తోచిన రీతిలో కానుక‌లు చెల్లిస్తున్నారు.

తాజాగా బార‌త దేశంలో అత్యంత పేరు పొందిన వాహ‌నాల త‌యారీ సంస్థ అశోక్ లేలాండ్ లిమిటెడ్ శనివారం టీటీడీకి రూ.31,72,532 విలువైన ట్రక్కును విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్ పోర్ట్ ఇన్ చార్జ్ జీఎం లక్ష్మీ ప్రసన్న, తిరుమల డీఐ కృష్ణయ్య పాల్గొన్నారు.

  • Related Posts

    గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన విద్యారణ్య పీఠాధిపతి

    Spread the love

    Spread the loveశుక్లాను ఆశీర్వ‌దించిన విరూపాక్ష స్వామీజీ హైద‌రాబాద్ : హంపి విరూపాక్ష విద్యార‌ణ్య పీఠాధిప‌తి విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ మ‌ర్యాద పూర్వ‌కంగా తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లుసుకున్నారు. హైద‌రాబాద్ లోని లోక్ భ‌వ‌న్ లో చాలా…

    అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

    Spread the love

    Spread the loveశ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో చౌద‌రితో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *