మ‌రోసారి చ‌ర్చ‌కు తెర తీసిన యానిమ‌ల్ సీన్

VijayaBhaskar · June 15, 2026
Spread the love

ప్రేమ‌, రొమాన్స్ ను తీసిన వంగా సందీప్ రెడ్డి

ముంబై : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన దర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి తీసిన హిందీ మూవీ యానిమ‌ల్. ఇది సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్ పోషించింది. ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అయితే అవి క‌థా ప‌రంగా మాత్ర‌మే తీశాన‌ని, తాను బూతు తీయ‌లేద‌ని ప్ర‌క‌టించాడు వంగా సందీప్ రెడ్డి ధైర్యంగా. ఇక తాజాగా చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కీ రోల్ పోషించిన పెద్ది వివాదాస్ప‌దంగా మారింది. ఇందులో జాహ్న‌వి క‌పూర్ ను పూర్తిగా దారుణంగా చిత్రీక‌రించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం దర్శ‌కుడు బుచ్చి బాబును ఏకి పారేస్తున్నారు.

ఇక యానిమ‌ల్ మూవీ గురించి ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. భారతదేశంలో ఏ దర్శకుడూ చిత్రీకరించని అత్యంత శృంగార భరితమైన షాట్ ను చిత్రీక‌రించాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఈ ఫోటో, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. యానిమల్ 99.99% భారతీయ దర్శకులకు ఒక పీడకలగా మారింది రణబీర్ కపూర్ తన అద్భుతమైన నటనతో తెరపై ఆకట్టుకున్నాడు. ఈ రొమాంటిక్ సన్నివేశాన్ని ఆకర్షణీయంగా , లైంగికంగా ప్రేరేపించేలా చేశాడు.