నిరాడంబ‌ర‌త‌, ఆప్యాయ‌త విజ‌య్ స్వంతం

VijayaBhaskar · June 16, 2026
Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన వ‌ర్ద‌మాన న‌టి సిమ్రాన్

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయిన్ గా కొన‌సాగుతూ వ‌చ్చిన న‌టి సిమ్రాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న కుటుంబంతో క‌లిసి మ‌ర్యాద పూర్వ‌కంగా త‌న తోటి అగ్ర న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ , ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో క‌లుసుకున్నారు. గ‌తంలో ఎన్నో సినిమాల‌లో విజ‌య్ తో క‌లిసి న‌టించారు . ఇందులో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు కూడా ఉన్నాయి. త‌న‌ను క‌లుసుకోవ‌డం ఈ సంద‌ర్బంగా చెప్ప‌లేనంత ఆనందాన్ని ఇచ్చింద‌ని పేర్కొంది న‌టి సిమ్రాన్.

సీఎంను క‌లిసిన అనంత‌రం న‌టి మీడియాతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ కూడా చేశారు. చాన్నాళ్ల త‌ర్వాత విజ‌య్ ను క‌లిశాను. ఎంతో సంతోషాన్ని క‌లిగించింది. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా త‌ను అలాగే ఉన్నాడ‌ని చెప్పింది. ఎలాంటి మార్పు లేదు. ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్న ఆయన ఆప్యాయత, వినయం , నిజాయితీ ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉన్నాయంటూ ప్ర‌శంస‌లు కురిపించింది. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావం, దూరదృష్టి ఎంతో స్ఫూర్తిదాయకం. తమిళనాడును ముందుకు నడిపిస్తున్న విజ‌య్ మ‌రింత ప్రజాద‌ర‌ణ చూర‌గొనాల‌ని కోరారు న‌టి సిమ్రాన్.