ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

అత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం

స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం ప్ర‌య‌త్నం చేయ‌డంలో, ఆయా దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాల‌ను నెర‌ప‌డంలో కీల‌క పాత్ర పోషిస్తూ వ‌స్తున్నారు. యుద్దాన్ని నిర‌సించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం ప్ర‌ధాన‌మంత్రి త‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఫ్రాన్స్ లో జ‌రిగిన జి7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. అనంత‌రం స్లోవేకియా దేశంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆ దేశం అత్యున్న‌త పౌర పుర‌స్కారం మోదీకి ల‌భించింది.

“ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” తో మోడీని సత్కరించారు స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వరకు 33 అంతర్జాతీయ పురస్కారాలు దక్కించుకుని రికార్డు సృష్టించారు ప్రధాని మోదీ. ఈసంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని ప్ర‌క‌టించారు. భారత్, స్లోవేకియా సుదీర్ఘ స్నేహ బంధానికి ఈ పురస్కారం అంకితం చేస్తున్న‌ట్లు తెలిపారు. పదవి చేపట్టిన నాటి నుంచి 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. పీఎం హోదాలో ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *