శ‌ర‌వేగంగా వెలిగొండ ప్రాజెక్టు ప‌నులు

Spread the love

ప‌రిశీలించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

మార్కాపురం జిల్లా : వెలిగొండ ప్రాజెక్టు పనులను బుధ‌వారం పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు పనులపై ఆరా తీశారు.వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం అన్నారు. కొల్లంవాగు నుండి 1 టిఎంసి నీరు టన్నెల్స్ లోకి చేరేలా 1.80లక్షల క్యూబిక్ మీటర్ల కు గానూ, ఇప్పటికి 58 వేల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించాం అన్నారు. టన్నెల్-1 లో అడ్డుగా ఉన్న 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40 వేల క్యూబిక్ మీటర్లు తొలగించిన‌ట్లు చెప్పారు. 20 నెలలో టన్నెల్-2లో 7 కి.మీ లైనింగ్ కి గానూ, 5.5 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేశాం అన్నారు.

మిగిలిన 1.5 కి.మీ లైనింగ్, జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. 5 ఏళ్ళ వైసిపి పాలనలో హైకోర్టు ఆదేశాలతో టన్నెల్-2 లో చిక్కుకు పోయిన టిబిఎం మెషిన్ వెలికితీత పనులు జరుగుతున్నాయ‌ని అన్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ 7 కంపార్ట్మెంట్ లలో ఇప్పటికి 3 కంపార్ట్ మెంట్లు బయటకు తీసుకొచ్చామ‌ని చెప్పారు. టిబిఎం లో క్లిష్టమైన హెడ్ ను టన్నెల్ లోనే పూడ్చిపెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నాం అన్నారు. ఫీడర్ కెనాల్ లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులు, జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశామ‌న్నారు. నత్తనడకన సాగుతున్న 21 కి.మీ లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు మంత్రి నిమ్మల.

  • Related Posts

    14.43 ల‌క్ష‌ల మంది రైతుల‌కు విజ‌య్ రుణ‌మాఫీ

    Spread the love

    Spread the loveతమిళనాడు ముఖ్య‌మంత్రి సంచలన నిర్ణయంచెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతుల‌కు రుణ మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ఇప్ప‌టికే…

    ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

    Spread the love

    Spread the loveఅత్యున్న‌త పౌర పుర‌స్కారంతో స‌త్కారం స్లోవేకియా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆయ‌న ప్ర‌పంచంలో అత్యున్న‌త నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ప్ర‌ధానంగా యుద్దాన్ని నివారించ‌డంలో , శాంతి కోసం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *