ఏపీలో కురియ‌నున్న భారీ వ‌ర్షాలు

Spread the love

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ

అమ‌రావ‌తి : నైరుతి రుతు ప‌వ‌నాలు ప్రారంభం అయ్యాయ‌ని, దీంతో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ హెచ్చ‌రించింది ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఐఎండీ). రాగల మూడు గంటలు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. అవ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట‌కు రావ‌ద్దంటూ సూచించింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయ‌ని, రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది ఏపీ ఐఎండీ.

తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయ‌ని ఎల్లో అల‌ర్ట్ హెచ్చ‌రించింది. చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాద‌ని పేర్కొంది. రాబోయే 24 గంట‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. అతి నుంచి భారీ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌. ఇదిలా ఉండ‌గా ఏపీ ఎంఐడీ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఏపీ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి…

    గ్రేట్ గ్రీన్ వాల్ కి మిస్టీ సహకారం

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ న్యూఢిల్లీ : గ్రీన్ ఇండియా మిషన్ కింద రాష్ట్రానికి సహకారం అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1,050 కిలోమీటర్ల సుధీర్ఘ తీర ప్రాంతాన్ని తుపానులు, ఉప్పెనలు లాంటి ప్రకృతి వైపరీత్యాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *