సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

అమ‌రావ‌తి : సూక్ష్మసేద్యం అమలులో ఏపీ నెంబ‌ర్ వ‌న్ అని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మసేద్య పరిధిలోకి తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, గిట్టుబాటు ధరలు, నష్టపరిహారం, విద్యుత్, సాగునీరు, మార్కెటింగ్ సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను నమ్మకుండా రైతులు వాస్తవాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువుల కొరత లేదని, రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు.

జూన్ 8వ తేదీ నుండి జూన్ 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 95,506 మంది రైతులకు మొత్తం 4,77,501 ఎరువుల బస్తాలు విక్రయించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో 3,56,916 యూరియా బస్తాలు, 1,20,585 డీఏపీ బస్తాలు రైతులకు అందించామని తెలిపారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఎరువులను అక్ర‌మంగా అమ్ముకున్నారు, ఎరువులను రైతులకు అంద‌చేసేందుకు ప్ర‌త్యేక‌ యాప్ ను తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా స‌క్ర‌మంగా ఎరువుల‌ కొనుగోలు జ‌రుగున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *