మా సంస్థ‌ను ప్ర‌జా ఉద్య‌మంగా మారుస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కె. అన్నామ‌లై

చెన్నై : భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఇటీవ‌లే ఆ పార్టీకి రాజీనామా చేసిన కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 50 లక్షల మంది సభ్యత్వ సంఖ్యను సాధించడం , ఈ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చడం మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఈ ఉద్యమం ఒక గొప్ప మార్పును తీసుకు వస్తుందనే నమ్మకంతోనే సభ్యులు ఇందులో చేరారని చెప్పారు. అమెరికా, లండన్ వంటి ప్రాంతాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సాధించిన 40 నుండి 50 ఏళ్ల వయసు గల తమిళులకు, ఇక్కడ రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించాలో తెలియదని అన్నారు.

రాబోయే నెలల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించడమే మా ఉద్దేశ్యం అని ప్ర‌క‌టించారు. తాము ముందుకు సాగుతున్న కొద్దీ రాష్ట్రంలోని వివిధ సమస్యల గురించి చర్చించేలా మా సంస్థను ఒక ప్రజా ఉద్యమంగా మార్చడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు కె. అన్నామ‌లై. ప్ర‌స్తుతం త‌మ ఫోక‌స్ అంతా రాష్ట్రంలో సుస్థిర‌మైన వ్య‌వ‌స్థ‌ను తీసుకు రావ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. అయితే కొత్త‌గా కొలువు తీరిన విజ‌య్ స‌ర్కార్ పై రాబోయే రోజుల్లో పోరాటం త‌ప్ప‌ద‌న్నారు .

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *