భారత్-యూకే మ‌ధ్య కీల‌క చ‌ర్చ‌లు

ఒక చారిత్రాత్మక మైలురాయి

ఫ్రాన్స్ : భార‌త్ , యుకె దేశాల మ‌ధ్య స‌త్ సంబంధాలు నెల‌కొన్నాయి. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అత్యంత కీల‌క‌మైన జి-7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేత‌ల మ‌ధ్య కీల‌క ఒప్పందం చోటు చేసుకుంది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15న అమల్లోకి రానుందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నట్లు వెల్ల‌డించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఇరు దేశాల మ‌ధ్య కొన్నేళ్లుగా కీలక‌మైన ప్ర‌ధాన అంశాల‌పై సంబంధాలు కొన‌సాగుతూ వ‌స్తున్నాయ‌ని అన్నారు పీఎం.

ఈ ఒప్పందం మన ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు గణనీయంగా ఊపునిస్తుంది అని పేర్కొన్నారు.
ఇది భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు , ఆవిష్కర్తలకు అనేక అవకాశాలను కల్పించి, వికసిత్ భారత్ 2047 సాకారానికి అర్థవంతంగా దోహద పడుతుందని చెప్పారు. జీ7 సదస్సు కోసం ఎవియన్‌లో ఉన్న ప్రధాని స్టార్మర్ , నేను, మన ఆర్థిక సంబంధాలకు లభిస్తున్న ఈ గణనీయమైన ఊపు పట్ల సహజంగానే చాలా సంతోషంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *