డిప్యూటీ డైరెక్ట‌ర్ న‌ర‌హ‌రి లాక‌ర్ల‌లో నోట్ల క‌ట్ట‌లు

ఇటీవ‌లే రిమాండ్ కు త‌ర‌లించిన పోలీసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారంద‌రినీ ఒక్కరొక్క‌రుగా టార్గెట్ చేస్తూ దాడుల‌కు దగుతోంది. ఈ త‌రుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు. ఆయ‌న‌కు సంబంధించి కిలోల కొద్ది బంగారు, వెండి ఆభ‌ర‌ణాల‌ను, ఫ్లాట్స్, ప్లాట్లు, భ‌వ‌నాలు, పొలాల‌కు సంబంధించి విలువైన ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. శ‌నివారం తాజాగా ఏసీబీ అధికారులు న‌ర‌హ‌రి రావుకు చెందిన ఆయా బ్యాంకుల‌లో లాకర్లను తెరిచారు.

దిమ్మ తిరిగేలా భారీ ఎత్తున నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ్డాయి. వాటిలో రూ.1.5 కోట్లను సీజ్ చేశారు. ఆ నోట్లకట్టలతో టేబుల్ నిండి పోయింది. ఇటీవల అతడి ఇళ్లలో సోదాలు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్‌లో పలు బిల్డింగులతో పాటు బ్యాంకుల్లోని రూ.5 కోట్ల విలువైన FDలు, ఖాతాలో రూ.2.29 కోట్లు, 1.3 KGల బంగారం, 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకెన్ని చోట్ల నోట్ల‌ను దాచి ఉంచార‌నే దానిపై పెద్ద ఎత్తున చర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీలో మ‌రో అవినీతి తిమిలింగాన్ని ప‌ట్టుకుంది ఏసీబీ.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *