పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష

12 ఏళ్ల బాలిక‌పై ప‌లు మార్లు అత్యాచారం

హైద‌రాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు పోక్సో కోర్టు న్యాయ‌మూర్తి. మానసిక వైకల్యం ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి, తన ఇంటికి తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారం చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి వెంకట నారాయణ. త‌న వ‌య‌సు 84 ఏళ్లు.

ఈ దారుణ‌మైన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మార్చిలో చోటు చేసుకుంది. అనుమానం వచ్చి బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకట నారాయణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక POCSO కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌పై కోర్టు తీర్పు ఇవ్వ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. మ‌రో వైపు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న‌యుడు సైతం పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. కానీ ఇంకా శిక్ష ఖ‌రారు కాలేదు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *