హామీల అమ‌లుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ

VijayaBhaskar · June 21, 2026
Spread the love

రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడ‌టం లేదు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు రామ‌చంద‌ర్ రావు. ఆదివారం ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి.
కాంగ్రెస్ అగ్ర నేత‌, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. తెలంగాణలో ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇస్తాం అని అన్నారు రామ‌చంద‌ర్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా కీలక హామీలు అమలు కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌ని ఆరోపించారు.

వ్య‌వ‌స్థ‌ల‌న్నీ ప‌ని చేయ‌డం లేద‌న్నారు . ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఎందుకు ఇవ్వాల్సి వ‌చ్చిందో చెప్పాల్సిన బాధ్య‌త రాహుల్ గాంధీకి లేదా అని ప్ర‌శ్నించారు. భార‌త రాజ్యాంగం ప‌ట్టుకుని దేశ‌వ్యాప్తంగా తిరిగిన త‌న‌కు హామీల అమ‌లులో ఎందుకు వైఫ‌ల్యం చెందానే దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేఖపై స్పందించి అపాయింట్‌మెంట్ ఇప్పించక పోతే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహంగా భావిస్తామని స్ప‌ష్టం చేశారు బీజేపీ అధ్య‌క్షుడు.