ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా షో రూమ్ ల్లో కేవలం మగ్గం మీద నేసే వస్త్రాలను విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆప్రో షో రూమ్ లను ప్రక్షాళన చేస్తున్నామని, షో రూమ్ ల్లో రెడీ మేడ్ వస్త్రాల అమ్మకాలతో పాటు కొత్త స్టాక్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారదర్శకత పెంచేలా ఆప్కోలో కంప్యూటరీకరణ చేపట్టామని, డిజిటల్ పే మెంట్లు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆప్కోలో డిజిటలైజేషన్ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2025 లభించిందన్నారు. ఆప్కో ద్వారా 24 నెలల కాలంలో రూ.190 కోట్ల అమ్మకాలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత రాష్ట్రంలో అయిదు చోట్ల పుట్టపర్తి,ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరు, టెక్కలి, అనకాపల్లిలో ఆప్కో షో రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని, రెండేళ్లలో ఎగ్జిబిషన్ల ద్వారా రూ.20 కోట్ల మేర చేనేత వస్త్రాలు అమ్మకాలు జరిపామన్నారు. 40, 50 శాతం డిస్కౌంట్లతో చేనేత వస్త్రాల అమ్మకాలు చేస్తున్నామన్నారు మంత్రి ఎస్. సవిత. చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా సోషల్ మీడియాలో విస్తృతం ప్రచారం చేస్తున్నామన్నారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. గత డిసెంబర్ర్, జనవరి నెలలో రూ.9 కోట్లకు పైగా బకాయిలను చేనేత సహకార సంఘాల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు.