యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

Spread the love

పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యోగా డే సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. యువ‌త ప్ర‌తి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌కు మ‌ధుమేహం ఉండేద‌ని అన్నారు. దీంతో మే 2020 నుండి ఇప్పటి వరకు నా జీవనశైలిలో నేను భారీ మార్పులు చేసుకున్నానని తెలిపారు. నా నిద్ర వేళలను సరిచేసుకోవడంతో పాటు, నీటి వినియోగం, ఆహారపు అలవాట్లు , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి సారించాన‌ని చెప్పారు అమిత్ చంద్ర షా.

ఇలా మార్పు చేసుకోవ‌డం వ‌ల్ల నా శ‌రీరంలో అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. దీని వ‌ల్ల త‌న‌కు ఎంతో మేలు జ‌రిగింద‌న్నారు. నేడు, నేను ఎలాంటి అల్లోపతి మందులు లేదా ఇన్సులిన్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు అమిత్ చంద్ర షా. యువత తమ శరీర ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటల వ్యాయామం, మెదడు విశ్రాంతి కోసం ఆరు గంటల నిద్రను కేటాయించాలని పిలుపునిచ్చారు. తాజాగా షా చేసిన కామెంట్స్ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

  • Related Posts

    మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Spread the love

    Spread the loveఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం…

    సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    Spread the love

    Spread the loveత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని ఆకాంక్ష‌ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోద‌రుడంటూ పేర్కొన్నారు. జూన్ 22 విజ‌య్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *