యువత వ్యాయామంపై దృష్టి పెట్టాలి
పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా
ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా డే సందర్భంగా ఆయన ప్రసంగించారు. యువత ప్రతి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాలని సూచించారు. గతంలో తనకు మధుమేహం ఉండేదని అన్నారు. దీంతో మే 2020 నుండి ఇప్పటి వరకు నా జీవనశైలిలో నేను భారీ మార్పులు చేసుకున్నానని తెలిపారు. నా నిద్ర వేళలను సరిచేసుకోవడంతో పాటు, నీటి వినియోగం, ఆహారపు అలవాట్లు , క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి వాటిపై దృష్టి సారించానని చెప్పారు అమిత్ చంద్ర షా.
ఇలా మార్పు చేసుకోవడం వల్ల నా శరీరంలో అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. దీని వల్ల తనకు ఎంతో మేలు జరిగిందన్నారు. నేడు, నేను ఎలాంటి అల్లోపతి మందులు లేదా ఇన్సులిన్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు అమిత్ చంద్ర షా. యువత తమ శరీర ఆరోగ్యం కోసం రోజుకు రెండు గంటల వ్యాయామం, మెదడు విశ్రాంతి కోసం ఆరు గంటల నిద్రను కేటాయించాలని పిలుపునిచ్చారు. తాజాగా షా చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.