రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు
14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
విజయవాడ : తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు. ఈ ఘటనకు కారకుడైన సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. తనను విజయవాడ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్బంగా కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు బయట పడ్డాయి. కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ ఉన్నాడు. తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చని అభిప్రాయపడింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్. ఈఘటన అనంతరం సీఐ నాగరాజు పరారయ్యాడు. ఈ సమయంలో మే 6న సాయికృష్ణను మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక పీఎస్‌కు తీసుకువచ్చారు.
సాయికృష్ణ పోలీసు కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. కావాలనే హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది. ఇదిలా ఉండగా సాయికృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారని ఆరోపించింది. కీలక CCTV ఫుటేజ్ డిలీట్ చేశారని బాంబు పేల్చింది. సీఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని కోర్టులో తెలిపింది. మరింత విచారణ కోసం సీఐ నాగరాజును పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.