తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

పిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలిపార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం, గొడ్డలిపార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసిపి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించే ఫేక్ పార్టీ. డిఎస్సీ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తే తప్పుడు ప్రచారం చేశారు. గతంలో డిఎస్పీ ప్రమోషన్లలో కూడా ఇదే తరహా తప్పుడు ప్రచారం చేశారు.

వాళ్లు అబద్ధం చెప్పినట్లుగా మనం నిజం కూడా చెప్పలేక పోతున్నాం. అందరూ కలసికట్టుగా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టండి. ప్రతి విషయం పార్టీ చెప్పదు, మీ అంతట మీరే స్పందించాలి. ఏదైనా సమస్య నాదృష్టికి తీసుకొస్తే వింటా, సీరియస్ గా తీసుకుంటా, తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్తా. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండండి. పొరుగు జిల్లాలో గొడ్డలిపార్టీకి చెందిన మాజీమంత్రి కొడుకుని కల్తీమద్యం కేసులో ఈడి అరెస్టు చేసింది. గొడ్డ‌లి పార్టీ ఐదేళ్ల పాల‌న‌లో జే బ్రాండ్స్ కార‌ణంగా లివర్ సిరోసిస్ 200 శాతం పెరిగింది, ఈ విష‌యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి అని పిలుపునిచ్చారు నారా లోకేష్‌.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *