చెర్రీని ప్ర‌ధాని పొగ‌డ‌డం ఆనందంగా ఉంది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మెగాస్టార్ చిరంజీవి

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న బుధ‌వారం త‌న సోష‌ల్ మ‌డియాలోని ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆయ‌న త‌న త‌న కొడుకు ప‌ట్ల చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. ఈ సంద‌ర్బంగా ఓ ప‌ద్యాన్ని కూడా గుర్తు చేశారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”

ప్రధానమంత్రి నరేంద్ర మోది పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిరంజీవి. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించు కోవడం నిజంగా సంతోషకరం అన్నారు మెగాస్టార్. ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

  • Related Posts

    ఆద‌ర్శ కుటుంబంలో చిట్టిబాబుగా వెంక‌టేశ్

    హైద‌రాబాద్ : విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఆదర్శ కుటుంబం “. ఈ సినిమాలోని ఆసక్తికరమైన పాత్రల పరిచయ కార్యక్రమాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా…

    య‌శ్ లాంటి సూపర్‌స్టార్‌ను చూడలేదు : నయనతార

    చెన్నై : ఇండియ‌న్ లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ గా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను కీ రోల్ పోషించింది గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాక్సిక్ మూవీలో. బెంగ‌లూరు వేదిక‌గా జ‌రిగిన చిత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *