ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఫైర్

అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖా మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆడుదాం ఆంధ్రాపై త‌మ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఏకంగా ఆడుదాం ఆంధ్రాలో రూ. 100 కోట్ల‌కు పైగా అవినీతి చోటు చేసుకుంద‌న్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వాస్తవాలు, ఆధారాల‌తో నివేదిక వ‌స్తుంద‌ని ఆ న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. రిపోర్టు వ‌చ్చాక ఎవ‌రు ఏమిటో బ‌య‌ట పెడ‌తామ‌ని, త‌ప్పు చేసిన వారు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌న్నారు మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. తప్పు చేసిన వారు భయంతో ముందుగానే స్పందిస్తున్నారని ఎద్దేవా చేశారు.. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారెవరూ తప్పించు కోలేరన్నారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమలులో ఎలాంటి లోపాలు లేవు అన్నారు. .ఉద్యోగాలు చేసుకునే 16 వేల మందిని అసత్య ఆరోపణలతో అవమానిస్తున్నారని ఆరోపించారు మండిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *