ఆర్డీఎస్ కు నీళ్లు అంద‌డం లేదు : సీఎం

పంచాయ‌తీలు వ‌ద్దు ప‌రిష్కార‌మే ముద్దు

క‌ర్ణాట‌క : సీఎం ఎ . రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పంచాయితీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే ముందుగా నేను పరిష్కారమే కోరుకుంటాన‌ని అన్నారు. గురువారం కర్ణాటకలోని మునీరాబాద్ లో జ‌రిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్ర‌సంగించారు.ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఇది 33 గేట్ల పునరుద్ధరణ కార్యక్రమం కాదని, మూడు తరాల సమస్యను పరిష్కరించే కార్యక్రమం అని పేర్కొన్నారు. లక్షలాది మంది రైతుల సమస్యలను ఈ గేట్ల పునరుద్ధరణ పరిష్కరించ బోతోందని చెప్పారు.

కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ మూడు రాష్ట్రాల సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారిస్తారని నమ్ముతున్నాన‌ని అన్నారు. గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం (RDS) కు కేటాయించిన 17.9 టీఎంసీల నీళ్లలో కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటోంద‌ని వాపోయారు సీఎం. దాదాపు 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేద‌న్నారు. తుంగభద్రలో మట్టి పేరుకు పోవడం, నీటి కేటాయింపుల సమస్యను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాం అన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సమావేశంలో నిర్ణయించుకున్నాం అని తెలిపారు.

  • Related Posts

    రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు…

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *