ఎమ‌ర్జెన్సీ చారిత్ర‌క సంఘ‌ట‌న కాదు

ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్

ముంబై : శివ‌సేన ఎంబీటీ పార్టీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఎన్సీఆర్టీసీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంద‌లో భాగంగా 9వ త‌ర‌గ‌తి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్త‌కంలో ఆనాటి ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ హయాంలో దేశంలో విధించిన అత్య‌యిక ప‌రిస్థితి (ఎమ‌ర్జెన్సీ)కి సంబంధించిన పాఠ్యాంశం చేర్చ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనికి కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపింది. ఆనాటి ఎమ‌ర్జెన్సీలో దేశంలో మాన‌వ హ‌క్కులు ఎలా కాల‌రాయ బ‌డ్డాయో నేటి విద్యార్థులు తెలుసు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎంపీ సంజ‌య్ రౌత్. గురువారం ఆయ‌న ముంబైలో జ‌రిగిన ఈ స‌మావేశంలో మాట్లాడారు. ఎమర్జెన్సీ అనేది ఒక రాజ్యాంగ నిబంధన మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక చారిత్రక సంఘటన కాదన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ దేశంలో గ‌త 12 ఏళ్లుగా బీజేపీ పాల‌న‌లో అప్ర‌క‌టిక ఎమ‌ర్జెన్సీ కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు .ఇందిర మన పార్టీని ఎప్పుడూ చీల్చలేదని అన్నారు. ఆమె జైలులో ఉన్న సంఘ్ నాయకులకు 5 స్టార్ ట్రీట్‌మెంట్ ఇచ్చార‌న్నారు. వారికి 5 స్టార్ చెఫ్‌లను ఏర్పాటు చేశార‌న్నారు. పాఠ్యప్రణాళిక నుండి ఎమర్జెన్సీని వెంటనే తొలగించాల‌ని సంజ‌య్ రౌత్ డిమాండ్ చేశారు.

  • Related Posts

    రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు…

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *