చ‌రిత్ర సృష్టించిన సీఎం జోస‌ఫ్ విజ‌య్

ఆరు కిలోమీట‌ర్ల మేర మార‌థాన్ లో ప‌రుగులు

చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ దేశ వ్యాప్తంగా సంచ‌లనంగా మారారు. ఆయ‌న శుక్ర‌వారం చెన్నైలో డ్ర‌గ్స్, మాద‌క ద్ర‌వ్యాలకు వ్య‌తిరేకంగా నిర్వ‌హించిన మార‌థాన్ ను ప్రారంభించారు . ఏకంగా యువ‌తీ యువ‌కుల‌తో క‌లిసి ఏకంగా ఆరు కిలోమీట‌ర్ల మేర ప‌రుగులు పెట్టారు. ఇది ఓ రికార్డ్. త‌మిళ‌నాట రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రి ఇలాంటి ఫీట్ ను సాధించ లేదు. ఓ వైపు పాల‌నా ప‌రంగా దూకుడు పెంచిన విజ‌య్ ఇప్పుడు ఫిట్ నెస్ ప‌రంగా కూడా తాను సిద్దంగా ఉన్నాన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచారు. విజ‌య్ మార‌థాన్ లో పాల్గొన‌డం ప‌ట్ల తెలంగాణ రాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. ఒక బాధ్య‌త క‌లిగిన ఉన్న‌త‌మైన సీఎం పోస్టులో ఉన్న వారు ఇలాంటి కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేరుతుంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రు డ్ర‌గ్స్ , మాద‌క ద్ర‌వ్యాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని పిలుపునిచ్చారు ఈ సంద‌ర్బంగా సీఎం విజ‌య్.

ఇదిలా ఉండ‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు విజయ్ ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో పాల్గొన్నవారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పిస్తామని, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి తమ వంతు సహాయం అందిస్తామని గంభీరమైన ప్రమాణం చేశారు. తమిళనాడులో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర అభివృద్ధికి , ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవ చేస్తామని ఈ ప్రతిజ్ఞ నొక్కి చెప్పింది.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *