త‌హ‌శిల్దార్ ఆస్తులు రూ. 5.05 కోట్లు

వెల్ల‌డించిన అవినీతి నిరోధ‌క శాఖ

హైద‌రాబాద్ : తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. అవినీతి తిమింగ‌లాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున అక్ర‌మంగా వ‌సూళ్లు చేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఆ మ‌ధ్య‌న స‌బ్ క‌లెక్ట‌ర్, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ , డిప్యూటీ డైరెక్ట‌ర్, త‌హ‌శిల్దార్, ఆర్ఐ, ఎస్ఐలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది లిస్టు. కేవ‌లం ఒక మండ‌లంలో ప‌ని చేసే ఎంఆర్ఓ (త‌హశిల్దార్) ఆస్తులు ఇంతలా ఉన్నాయంటే ఇక ఉన్న‌త స్థాయిలో ప‌ని చేసే ఆఫీస‌ర్ల అక్ర‌మ ఆస్తులు ఎన్ని ఉన్నాయో అర్థం కావ‌డం లేదు.

ఇదిలా ఉండ‌గా తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శామీర్ పేట తహ‌శిల్దార్ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి ఏసీబీకి. రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఇప్పటికే అరెస్ట్ అయ్యింది. సస్పెండ్ అయిన తహసీల్దార్ , జాయింట్ సబ్-రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరిత, డీఏ కేసును కూడా ఎదుర్కొంటున్నారు. ఏసీబీ సోదాలలో సిద్దిపేటలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో 3 ఫ్లాట్లు, 2 ప్లాట్లు, ఒక వోక్స్‌వ్యాగన్, ఒక హ్యుందాయ్ క్రెటా, రూ. 1.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ. 12 లక్షల నగదు, బ్యాంకు డిపాజిట్లలో రూ. 38 లక్షలు బయట పడ్డాయి. ఇదిలా ఉండ‌గా తన అక్ర‌మ ఆస్తుల విలువ రూ. 5.05 కోట్లు ఉన్న‌ట్లు గుర్తించింది.

  • Related Posts

    గుర్రం జాషువా ఆశయ సాధనకు కృషి చేస్తాం : కందుల దుర్గేష్

    విజ‌య‌వాడ : క‌వి గుర్రం జాశువా ఆశ‌య సాధ‌న కోసం కృషి చేస్తామ‌ని అన్నారు రాష్ట్ర ప‌ర్యాట‌క , సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. సోమ‌వారం పద్మభూషణ్ గుర్రం జాషువా 131వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సోమ‌వ‌వారం రాష్ట్ర సృజనాత్మక,…

    రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *