‘గోల్డ్‌మ్యాన్ సూర్య భాయ్’ అరెస్ట్

సీఎం, సీపీకి తాను క్లోజ్ అంటూ మోసం

హైద‌రాబాద్ : గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు సూర్య భాయ్. త‌ను త‌క్కువ ధ‌ర‌కే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ న‌మ్మించాడు. ఆపై ప్ర‌జ‌ల , మ‌హిళ‌ల బ‌ల‌హీన‌త‌ల‌ను ఆస‌రాగా చేసుకుని అందినంత మేర దండుకున్నాడు. ఆపై మోసానికి పాల్ప‌డ్డాడు. చివ‌ర‌కు తాము మోస పోయిన‌ట్లు భావించిన బాధితులు ల‌బోదిమంటున్నారు. దీంతో చేసేది లేక పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్ లోని అత్తాపూర్ పీఎస్ లో సూర్య భాయ్ అలియాస్ సూర్య‌కుమార్ పై కేసు న‌మోదు చేశారు. ఆపై త‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు న‌గ‌ర పోలీసులు. ఇదిలా ఉండ‌గా సూర్య భాయ్ మామూలోడు కాదు. త‌న‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి బాగా తెలుస‌ని, అంతే కాకుండా ఎన్ కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ గా పేరు పొందిన పోలీస్ ఆఫీస‌ర్ , హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ గా ఉన్న వీసీ స‌జ్జ‌నార్ కూడా త‌న‌కు ఫ్రెండ్ అంటూ న‌మ్మించాడు. ఆపై వారితో క‌లిసి ఉన్న ఫోటోల‌ను కూడా షేర్ చేశాడని పోలీసులు వెల్ల‌డించారు. బాదితుల నుంచి మ‌నోడు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో త‌న బండారం బ‌ట్ట బ‌య‌లు అయ్యింది.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *