కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు..?

సంకేతాలు ఇచ్చిన ట్ర‌బుల్ షూట‌ర్ షా

న్యూఢిల్లీ : కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్డీయే ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన ప‌ద‌వులు మార్చే ఛాన్స్ లేక పోలేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా బీజేపీకి చెందిన ట్ర‌బుల్ షూట‌ర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , పీఎం మోదీతో పాటు ఎవ‌రిని నియ‌మించాలి, ఎవ‌రిని తీసి వేయాల‌ని నిర్ణ‌యించే ఆర్ఎస్ఎస్ బాస్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ సూచ‌న‌ల‌తో కొంద‌రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించే ఛాన్స్ ఉన్న‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేశార‌ని, వ‌చ్చే వారం భారీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉండ బోతోంద‌ని స‌మాచారం.

ఒక సీసీఎస్ మంత్రి మారవచ్చు. మాజీ సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలో చేరవచ్చు. మాజీ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంత్రివర్గంలో చేరవచ్చని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు రికార్డు స్తాయిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ హెచ్‌ఆర్‌డి శాఖకు మారవచ్చు. పలువురు మంత్రులను తొలగించడం లేదా పునర్వ్యవస్థీకరించడం జరగవచ్చు. వీరిలో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేర్ల‌లో శ్రీకాంత్ షిండే, అనురాగ్ ఠాకూర్, అరుణ్ గోవిల్, జనార్దన్ సింగ్ సిగ్రివాల్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఇటీవ‌లే ఆప్ కు గుడ్ బై చెప్పిన రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్‌కు కూడా మంత్రి పదవి లభించవచ్చు. పంజాబ్ నుంచి రవనీత్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్‌ను నియమించవచ్చు.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *