బీసీల సమస్యలకు పరిష్కారం చూపాలి

బేరి రామచందర్ యాదవ్ డిమాండ్

హైదరాబాద్ :తెలంగాణలోని బీసీ కులాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ కోరారు. బీసీల డిమాండ్ల కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావుకి శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టింగ్ అభ్యర్థి మారబోయిన రవి కుమార్ యాదవ్ కి బీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ సమక్షంలో ఓబీసీ సమస్యల గురించి వినతి పత్రం సమర్పించారు. మియాపూర్ ఓబీసీ మోర్చా సమావేశం మ‌దీనగూడ భూమి బ్యాంకెట్ హాల్లో నిర్వహించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉన్నందున 54 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని, పేద వర్గాలైన 132 బీసీ కులాలకు అన్ని విధాల సహాయ పడాలని కోరారు.

బీసీ కులాల్లో ఎక్కువగా పేదలు ఉన్నార‌ని వారికి విద్య‌, వైద్యం అందించేందుకు కృషి చేయాల‌ని విన్న‌వించారు. ముద్ర లోన్లు, సబ్సిడీ లోన్స్ మిగతా అన్ని సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అన్ని బీసీ కుల సంఘాలకు వర్తించే విధంగా వృత్తి ధర్మంగా 132 కులాలకు సహాయం చేయాలని కోరారు రైతుల్లో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నార‌ని వాపోయారు. బ్యాంకు లోన్లు ఇవ్వ‌క పోవ‌డంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందుల‌కు లోన‌వుతున్నార‌ని పేర్కొన్నారు. స‌బ్సిడీ కింద విత్త‌నాలు, ఎరువులు ఇవ్వాల‌ని అన్నారు.

  • Related Posts

    రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు…

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *