ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల‌కు రు. 2711.79 కోట్లు

విడుద‌ల చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్‌దారులకు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 2,711.79 కోట్లను విడుదల చేసిన‌ట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. జూలై 1వ తేదీ ఉద‌యం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్ష‌న్లు పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు (Spouse Pensions) జూలై 1న పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ. 3.12 కోట్లను విడుదల చేసిన‌ట్టు కూడా మంత్రి తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు పెన్ష‌న్ల కోసం ఈ నెల విడుద‌ల చేసిన నిధుల‌తో క‌లుపుకుని రూ. 68,598.44 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింద‌ని వెల్ల‌డించారు. నిరుపేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కూట‌మి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ భ‌రోసా పెన్షన్ నిధుల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే ల‌బ్ధిదారుల‌కు అందిస్తోంద‌ని మంత్రి కొండ‌ప‌ల్లి తెలిపారు.

  • Related Posts

    రిజర్వాయర్ల మెయింటెన్స్ పనులకు రూ. 160 కోట్లు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని కాలువలు ,డ్రెయిన్లు, రిజర్వాయర్ల ఆపరేషన్, మెయింటెన్స్ పనులకు సంబందించి 160 కోట్ల బిల్లులు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింద‌న్నారు. తక్ష‌ణ‌మే నిధుల విడుద‌ల‌కు…

    రేవంత్ రెడ్డి రాజకీయ సమాధికి పునాది వేస్తాం : మ‌ల్ల‌న్న‌

    వికారాబాద్ జిల్లా : ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడంగల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కోస్గిలో పాద‌యాత్ర సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రానికి త‌ను చివ‌రి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌న్నారు. బీసీలకు రాజ్యాధికారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *