Friday, 16 October 2026

అనితా రాధాకృష్ణ‌న్ అరెస్ట్ స‌బ‌బే : మాణిక్కం ఠాగూర్

newsseals-ManikkamThakoor

చెన్నై | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు త‌మిళ‌నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాణిక్యం ఠాగూర్ . శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. “రాజకీయ నాయకత్వంపై విమర్శలు చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం పాటించాలని స్ప‌ష్టం చేశారు. దీని తర్వాతనైనా ప్రతిపక్షాలు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాయని, నాయకత్వంపై ఇలాంటి దాడులకు దిగవని నేను ఆశిస్తున్నానని అన్నారు. అనితా రాధాకృష్ణ‌న్ త‌న స్తాయిని మ‌రిచి పోయి మ‌రీ ప్ర‌జ‌లు సిగ్గుప‌డేలా భాష‌ను ఉప‌యోగించార‌ని, త‌న‌ను ప్ర‌భుత్వం అరెస్ట్ చేయాల‌ని ఆదేశించ‌డం స‌రైన‌దేన‌ని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గురించి కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు మాణఖ్కం ఠాగూర్. గవర్నర్ హోదాలో ఉండి కళాశాలలు, పాఠశాలల్లో ప్రసంగాలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరం అన్నారు. ఆయన గోవా ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తుండవచ్చు, కానీ సున్నితమైన ప్రాంతమైన తమిళనాడు వ్యవహారాలను ఇలా నిర్వహించడం సరికాదని హిత‌వు ప‌లికారు. ఒకవేళ గోవా తరహా రాజకీయాలు చేయాలనుకుంటే, అక్కడికే వెళ్ళిపోవాల‌ని కోరారు. తన పరిధిని మించి వ్యవహరించవద్దని నేను ఆయనను కోరుతున్నానని పేర్కొన్నారు. గతంలో మిస్టర్ రవి కూడా ఇలాగే ప్రయత్నించి తమిళనాడు నుంచి వెనుదిరగాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *