newsseals.com

2027లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎస్పీదే రాజ్యం : ప్రియా స‌రోజ్

July 7, 2026 · VijayaBhaskar

ఉత్త‌ర ప్ర‌దేశ్ : అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాది పార్టీకి చెందిన రింకూ సింగ్ కు భార్య అయిన ప్రియా స‌రోజ్ సంచ‌ల‌నంగా మారారు. ఆమె 26 ఏళ్ల వయసులో మచ్లీషహర్ లోక్‌సభ స్థానాన్ని 35,850 ఓట్ల మెజారిటీతో గెలుచుకుని ఎంపీ అయ్యారు.ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ కూడా సైద్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండ‌గా మచ్లీషహర్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీపీ సరోజ్‌ను భారీ ఓట్ల తేడాతో ఓడించి ప్రియా సరోజ్ విజయం సాధించారు. త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు.

ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ 2022లో కెరకట్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు; అంతకు ముందు ఆయన 1999, 2004 , 2009లలో ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రముఖ క్రికెటర్ రింకూ సింగ్‌తో ప్రియా సరోజ్ నిశ్చితార్థం 2025 జూన్ 8న జరిగింది; ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ ,జయా బచ్చన్ హాజరయ్యారు. మచ్లీషహర్‌కు చెందిన ప్రియా సరోజ్ 2027 ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. 2027లో ఎస్పీ (SP) ప్రభుత్వం వస్తుందని, అప్పుడే ప్రజల పనులు చేయించగలనని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. ఈ సంద‌ర్బంగా ప్రియా స‌రోజ్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Related News