Saturday, 17 October 2026

దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ

newsseals-SriCity

శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు తిరుపతి రీజియన్ అనుకూలమన్నారు. ఇచ్ఛాపురం నుంచి చెన్నయ్ వరకు నాలుగు వరుసల రైల్వే లైన్ వస్తోందని చెప్పారు. మౌలిక వసతులను వినియోగించుకుని టీఈఆర్‌ను మరింతగా ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలన్నారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్ మేరకు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఏపీని తయారు చేయాలన్న లక్ష్యంలో భాగంగా ..తిరుపతి ఎకనమిక్ రీజియన్ వాటాగా 0.90 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. టీఈఆర్ ప్రణాళికల కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య మొత్తం 9 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతీ 2 నెలలకు ఒకసారి 3 ఎకనామిక్ రీజియన్లపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం అన్నారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈ మూడు రీజియన్ల ప్రత్యేక అధికారులు ముఖేష్ కుమార్ మీనా, సురేశ్ కుమార్, యువరాజ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *