గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించింది. అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హోమ్, ఆఫీస్ ఫర్నిచర్ కలెక్షన్లతో ఈ విశాలమైన షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన షోరూమ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ 32 సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ అను ఫర్నిచర్ నిరంతరం అభివృద్ధి చెందడం అభినందనీయమైన విషయం అన్నారు. ఒక చిన్న సంస్థగా ప్రారంభమై నేడు 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించడం సంస్థ నిబద్ధతకు నిదర్శనం. నాణ్యత, ఆధునిక డిజైన్లు, వినియోగదారుల సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న అను ఫర్నిచర్ మరింత అభివృద్ధి చెందాలని కోరారు. అను ఫర్నిచర్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ 32 ఏళ్ల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన అను ఫర్నిచర్‌కు వినియోగదారులు చూపిన అపారమైన ఆదరణ వల్ల నేడు 19వ స్టోర్‌ను ప్రారంభించే స్థాయికి చేరుకున్నాం. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతతో, ఆధునిక డిజైన్లతో, అందుబాటు ధరల్లో ఫర్నిచర్ అందించడం మా లక్ష్యం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించి అను ఫర్నిచర్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని తెలిపారు.

నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ నేను కూడా మా ఇంటి కోసం అను ఫర్నిచర్ నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేశారు. వాటి నాణ్యత, ఫినిషింగ్, డిజైన్లు చాలా బాగుంటాయన్నారు. మంచి క్వాలిటీని సరసమైన ధరల్లో అందించడం అను ఫర్నిచర్ ప్రత్యేకత. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. డైరెక్టర్ భరత్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా అను ఫర్నిచర్ స్టోర్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇది మా 19వ స్టోర్. అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని వెల్లడించారు.

  • Related Posts

    నా భ‌ర్త‌ను అక్ర‌మంగా నిర్బంధించారు

    న్యూఢిల్లీ : త‌న భ‌ర్త ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ ను అక్ర‌మంగా నిర్బంధించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వాంగ్ చుక్ భార్య‌. ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు,…

    హైడ్రాకు రెండేళ్లు హైద‌రాబాద్ లో ర్యాలీలు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా ఏర్పాటై 2 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ చెరువులు, స్థ‌లాలు, భూముల‌ను భారీ ఎత్తున కాపాడింది. అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టింది. హైడ్రాకు మ‌ద్ద‌తుగా న‌గ‌ర వాసులు పెద్ద ఎత్తున…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *