రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ రాదు : ఈటల రాజేంద‌ర్

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న కాంగ్రెస్ పార్టీని, ప్ర‌త్యేకించి త‌నంత‌కు తాను న‌ర హంత‌కుడు హిట్ల‌ర్ గురించి ప్ర‌శంస‌లు కురిపిస్తూ వ‌స్తున్న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయలేదు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు. నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు లేవు. మహిళకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు కార్పొరేషన్ రుణాలు లేవు. ఏ ఇష్యూ పరిష్కారం చేయకుండా మభ్యపెట్టి మోసం చేస్తున్నారని, అందుకే ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశమే లేద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్.

ప్రభుత్వానికి విచక్షణాధికారాలు ఉండ‌వ‌చ్చు. కానీ ఇల్లు కూలగొట్టే అధికారం లేద‌న్నారు హైడ్రాపై ఎంపీ. లక్షల మందిని చంపిన దుర్మార్గుడు హిట్లర్.. ఆయన ప్రజలను హింసించడానికి పెట్టుకున్న హైపర్ కమిటీ పేరు హైడ్రా అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. ఆ నియంత వారసుడిని అని చెప్పుకుంటున్న ఆయన 40, 50 ఏళ్ల క్రితం వచ్చి చిన్న ఇల్లు కట్టుకున్న వారివి కూల్చే వేస్తే వారి వ్యథ మాటల్లో చెప్పలేమ‌న్నారు. నల్లచెరువు దగ్గర బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. జొన్నలబండ దగ్గర వడ్డెరల ఆర్థనాదాలు చూడలేక పోయామ‌మ‌న్నారు. హైడ్రా ప్రజలను వేధించే సంస్థ, పేదల ఇళ్లను కూలగొట్టేది. వారు అనుకున్న వారికి భూములు కూడబెట్టి, వ్యతిరేకంగా ఉన్నవారి భూములు గుంజు కోవ‌డం త‌ప్పా చేసింది ఏమీ లేద‌న్నారు. తప్పు రంగనాథ్ డి కాదు రేవంత్ రెడ్డిద‌న్నారు.

  • Related Posts

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారలమ్మ’ పేరు పెట్టండి

    హైద‌రాబాద్ : ధ‌ర్మ స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు డాక్టర్ విషార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వంగా సందీప్ రెడ్డి వరంగ‌ల్ ఎయిర్ పోర్టుకు రుద్ర‌మ‌దేవి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *