త‌ప్పుడు ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్దం : హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల‌పై హైడ్రా ముమ్మ‌ర విచార‌ణ చేప‌ట్టింద‌ని, కానీ కొంద‌రు దీనితో త‌మ సంస్థ‌కు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా అధికారుల వరకు జోరుగా పంపకాలు జ‌రిగిన‌ట్టు పేర్కొన‌డం త‌గ‌ద‌ని హెచ్చ‌రించింది. దీనిని నిర్ధారించు కోకుండా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలు దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని పేర్కొంది. హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేయడం తెలుగు స్క్రైబ్ కు అల‌వాటుగా మారింద‌ని, ఇది స‌రైన విధానం కాదంది. ఫేక్ ఫైర్ ఎన్ వోసీల వ్య‌వ‌హారంలో నిగ్గు తేల్చేందుకే పోలీసుల‌కు జులై 4వ తేదీన‌ హైడ్రా ఫిర్యాదు చేసింది. ప‌త్రిక‌ల్లో రెండు రోజుల క్రితం వార్త‌లు వ‌స్తే.. నెల రోజుల ముందే లేక్ పోలీసుల‌కు హైడ్రా ఫిర్యాదు చేసిన విష‌యాన్ని గుర్తు చేసింది.

జీహెచ్ ఎంసీ, ఫైర్ డిపార్టు మెంట్ పేరుమీద‌.. ర‌క‌ర‌కాల స్టాంపులతో.. వేర్వేరు కార్యాల‌యాల పేరిట ఫైర్ ఎన్‌వోసీలు జారీ అయిన విష‌యం ఒక‌టొక‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయ‌ని హైడ్రా తెలిపింది. 15 మీట‌ర్ల ఎత్తు లోపు ఉన్న భ‌వ‌నాల‌కే హైడ్రా ఫైర్ ఎన్ వోసీలు జారీ చేస్తుంది. 15 మీట‌ర్ల ఎత్తుకంటే ఎత్తైన భ‌వ‌నాల‌కు రాష్ట్ర ఫైర్ శాఖ ఎన్ వోసీల‌ను ఇస్తుంది. హైడ్రా రాక ముందు జీహెచ్ ఎంసీ ఫైర్ ఎన్ వోసీల‌ను జారీ చేసేది. ఇప్ప‌టికీ జీహెచ్ ఎంసీ పేరిట ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు జారీ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా ఫైర్ ఎన్ వోసీల‌ను జారీ చేయాల‌నే ఉద్దేశంతోనే ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌తో పాటు జారీని హైడ్రా చేప‌ట్టింది. ఫైర్ ఎన్‌వోసీమీద ఉన్న క్యూఆర్ కోడ్ ఆధారంగా ధ్రువీక‌రించుకునే వెసులుబాటు కూడా క‌ల్పిస్తున్నామ‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది.

  • Related Posts

    సోనియా గాంధీ కేసు మెజిస్ట్రేట్ కు అప్ప‌గించిన కోర్టు

    న్యూఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసును తిరిగి మేజిస్ట్రేట్‌కు అప్పగించంది ఢిల్లీ కోర్టు. మేజిస్ట్రేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులో తగిన కారణాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కొత్తగా…

    డీఎస్సీ స్కాంపై సీబీఐ విచార‌ణ జ‌ర‌పాలి

    విజ‌య‌వాడ : డీఎస్సీ స్కాంపై CBI విచారణ జరపాలని, లోకేష్ రాజీనామా చేయాలని YSRCP డిమాండ్ చేసింది. కుంభకోణం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు నిష్పాక్షికమైన విచారణ జరపాలని , ఇందుకు బాధ్య‌త వ‌హిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *