మాజీ మావోయిస్టుల‌కు ఉపాధి అవ‌కాశాలు

వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో లొంగి పోయిన మాజీ మావోయిస్టుల‌కు తీపి క‌బురు చెప్పారు డీజీపీ సీవీ ఆనంద్. మాజీ మావోయిస్టులతో సమావేశం అయ్యారు. గృహ వసతి, న్యాయ సహాయం, ఉపాధి అవకాశాలు , ఆర్థిక సహాయానికి సంబంధించిన వారి సమస్యలు, విజ్ఞప్తులను విన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని , వారికి సాధ్యమైనంత మేర సహాయం అందిస్తానని వారికి హామీ ఇచ్చారు డీజీపీ సీవీ ఆనంద్. ఉపాధి పొందడానికి అంతే కాకుండా స్థిరమైన జీవితాన్ని నిర్మించు కోవడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తాము సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

తెలిసో తెలియ‌కో ప‌రిస్థితుల కార‌ణంగా గ‌తంలో న‌క్స‌లైట్లుగా మారార‌ని, బుద్ది తెచ్చుకుని జ‌న జీవ‌న స్ర‌వంతి లోకి వ‌చ్చార‌ని దీనికి స‌ర్కార్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్నారు డీజీపీ. అలాగే, అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, ప్రధాన స్రవంతి సమాజంలో పూర్తిగా కలిసి పోవాలని సూచించారు. ఈ సందర్భంగా వారికి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు డీజీపీ. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ‘లొంగుబాటు , పునరావాస విధానం’లో భాగంగ ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులకు ప్రోత్సాహక నగదుకు సంబంధించిన చెక్కులను కూడా అందజేశారు.

  • Related Posts

    పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాలి

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో పాద‌చారుల భ‌ద్ర‌త‌పై దృష్టి సారించాల‌ని సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. ట్రాఫిక్, రహదారి మౌలిక సదుపాయాలు, వర్షాకాల సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కీల‌క మీటింగ్ లో 334 రహదారి మౌలిక…

    పోస్ట‌ల్ ఇన్‌స్పెక్టర్ కౌశిక్ కు కేంద్ర మంత్రి కంగ్రాట్స్

    న్యూఢిల్లీ : కేంద్ర టెలికాం, పోస్ట‌ల్ శాఖ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తమిళనాడు సర్కిల్‌లోని బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పోస్ట్స్ ఎస్. కౌశిక్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌ను చేసిన ప‌నికి ఇవాళ దేశంలోని కోట్లాది…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *