newsseals.com

నేరాలు తగ్గేలా భద్రత పెరిగేలా చ‌ర్య‌లు : అనిత

August 11, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : రాష్ట్రంలో కొన‌సాగుతున్న నేరాలు అదుపు చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. నేరాలు త‌గ్గేలా, భ‌ద్ర‌త పెరిగేలా కృషి చేస్తున్నామ‌న్నారు. ప్రజల భద్రత విషయంలో త‌మ‌ ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదు, నేరం జరగకుండా ముందస్తు నిఘా, సాంకేతికతతో పటిష్టమైన భద్రతా వ్యవస్థను నిర్మించడం జ‌రుగుతోంద‌న్నారు అనిత వంగ‌ల‌పూడి. రాష్ట్ర వ్యాప్తంగా 1.4 లక్షల CCTV కెమెరాల ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

మొబైల్ ఫోన్ లొకేషన్ ట్రాకింగ్, డ్రోన్ల వినియోగంతో నేరాల నియంత్రణలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు అనిత వంగ‌ల‌పూడి. వేలాది కేసులను ఛేదించి, ప్రజలకు చెందిన ఆస్తులను తిరిగి అందించగలిగాం అని పేర్కొన్నారు. ప్రజల ప్రాణం, ఆస్తికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. ఆ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం అని హెచ్చ‌రించారు. ప్రజల భద్రతే మా ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు . గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌న్నారు. జ‌గ‌న్ రెడ్డి ఆట‌లు సాగ‌వ‌న్నారు.

Related News