పోల‌వ‌రం ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. గ‌త ప్ర‌భుత్వం ప్రాజెక్టుల గురించి ప‌ట్టించు కోలేద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ , అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై స‌చివాల‌యంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ సివిల్ పనులు 89.9 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రికి జ‌ల వ‌న‌రుల శాఖ ఉన్న‌తాధికారులు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు.

ఇదిలా ఉండ‌గా ECRF డ్యామ్ గ్యాప్-1 , గ్యాప్-2 పనులు వేగంగా సాగుతున్నాయా లేదా అని ఆరా తీశారు నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వ, నీటి విడుదల , ఇతర సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సంద‌ర్బంగా నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పోల‌వ‌రం , వెలిగొండ ప్రాజెక్టుల ప‌నులు ఆల‌స్యం కావ‌డానికి వీలు లేద‌న్నారు. సాద్య‌మైనంత త్వ‌ర‌గా ప‌నులు యుద్ద ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీబీఎన్ స్పీడ్ అందుకోలేం : నారా లోకేష్

    విజ‌య‌వాడ : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పీడ్ ను ఇప్ప‌ట్లో అందుకోవ‌డం చాలా కష్ట‌మ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత నాకు ఇస్తే.. దేశ తలరాతను మారుస్తానని స్వామి వివేకానంద…

    నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి

    హైద‌రాబాద్ : నిరుద్యోగుల దెబ్బ‌కు దిగి వ‌చ్చారు శాసన మండ‌లి స‌భ్యులు కోదండ‌రాం రెడ్డి. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇటీవ‌లే హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్ లో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *