Friday, 16 October 2026

గ‌వ‌ర్న‌ర్ కు ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆహ్వానం

Newsseals-Governor

హైదరాబాద్ : హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభిస్తారు. మంగళవారం నాడు లోక భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ని ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసింది. జాతీయ స్థాయిలో జరిగే ఈ కాంక్లేవ్ ప్రారంభ ఆహ్వాన విందుకు హాజరవుతానని గవర్నర్ తన అంగీకారం తెలిపారు. జాతీయ స్థాయిలో మీడియా పోకడలు ఎదుర్కొంటున్న సవాళ్లు, జర్నలిస్టుల పనితీరుపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సందేశం ఇస్తారు.

ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఏ. రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యులు ఎన్ .శ్రీనివాస్ రెడ్డి తదితరులు గవర్నర్ ని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఇదే సందర్భంగా గవర్నర్ కు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీని పాలక మండలి అందజేసింది. పూల మొక్కను అందజేసి సత్కరించారు. ఈనెల 21 తేదీన తాజ్ కృష్ణ హోటల్లో జరిగే ఈ సదస్సు ప్రారంభ ఆహ్వాన విందు కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దేశం నలుమూలల నుంచి సీనియర్ జర్నలిస్టులు ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెండు రోజుల సదస్సుకు హాజరవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *