newsseals.com

ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే గ్రామాల అభివృద్ది : సీఎస్

August 22, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్ విశ్వ విద్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు వ్యవ‌సాయ రంగం గురించింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న ఎలి నినో ప్ర‌భావం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో విస్తృతంగా వరి సాగు ప్రారంభమైందని సీఎస్‌ సంజయ్‌ జాజు తెలిపారు. ఇంకా సుమారు 20 లక్షల ఎకరాల్లో నాట్లు వేయాల్సి ఉందని అన్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పెరి-అర్బన్‌ ప్రాంతాల్లో వ్యవసాయం, ఉద్యానవనం, పూల సాగును ప్రోత్సహించాలని అన్నారు సీఎస్ . వాటికి అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వీబీ-జీ రామ్‌జీ ద్వారా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామ స్థాయిలో పక్కా ప్రణాళిక ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు. వర్క్‌షాప్‌కు హాజరైన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

Related News