గాయం తర్వాత రష్మిక మందన్న షూటింగ్ కు రెడీ
హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలే సినిమా షూటింగ్ సందర్బంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె తుంటి గాయం నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ రష్మిక త్వరలోనే తన వృత్తిపరమైన పనులను తిరిగి ప్రారంభిస్తానని తెలిపింది. అయితే ఇంట్లో గడిపిన సమయాన్ని మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతానని చెప్పింది. నేను త్వరలో పనిలోకి తిరిగి వస్తున్నాను, ఇదంతా ఖచ్చితంగా మిస్ అవుతాను అని ఆమె పేర్కొంది.
తన రాబోయే చిత్రం ‘మైసా’ (Mysaa) షూటింగ్ సమయంలో గాయపడ్డారు. .కోలుకునే సమయంలో తాను గడిపిన సమయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఒక వీడియోను రష్మిక పంచుకుంది. పూజలు చేయడం, తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం, పిక్చర్ పజిల్స్ పరిష్కరించడం , తోటలో సమయం గడపడం వంటి కార్యకలాపాల ద్వారా పనికి దూరంగా ఉన్న రోజులను ఆమె అభిమానులకు చూపించింది.
రష్మిక ఇంతకు ముందు ఆగస్టు 3న తన గాయం గురించి వెల్లడించింది. వరుసగా మూడవసారి గాయం కావడంతో తాను పనికి దూరంగా ఉన్నానని, కోలుకోవడంపై దృష్టి సారిస్తున్నానని ఆమె తెలిపింది. తన కుడి తుంటిలోని ఒక టెండన్ (కండర బంధనం) విడిపో యిందని, అది నయం కావడానికి సమయం పడుతుందని కూడా ఆమె వివరించింది. ‘మైసా’ చిత్రంలోని ఒక డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమెకు ఈ గాయం అయ్యింది; తాను పనిచేసిన చిత్రాలలో శారీరకంగా అత్యంత కష్టమైన చిత్రాలలో ఇది ఒకటని ఆమె పేర్కొంది. గాయాలు చాలా ఇబ్బంది కరమైనవి.. ఎవరికీ తెలియ కూడదని నేను నిజంగా ఆశించాను.. కానీ ఏం చేస్తాం. నేను కనిపించకుండా పోయినందుకు క్షమించండి. వరుసగా నాకు ఇది మూడవ గాయం ఇది. నా శరీరాన్ని ఏదో యంత్రంలా కాకుండా, ఒక మనిషి శరీరంగా చూసుకోవడం నేను ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంది అని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ.