newsseals.com

సెప్టెంబర్ లో తిరుమలలో విశేష పర్వదినాలు

September 1, 2026 · VijayaBhaskar

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. ఈ విశేష ప‌ర్వ‌దినాల సంద‌ర్బంగా వివిధ ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కోర్చి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు వ‌స్తుంటార‌ని, ప్ర‌క‌టించిన తేదీల‌ను గ‌మ‌నించి త‌మ ప్ర‌యాణ ఏర్పాట్లు చేసుకోవాల‌ని టీటీడీ కీల‌క సూచ‌న‌లు చేసింది. సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇప్ప‌టికే చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆదేశాల మేర‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపింది.

ఇక విశేష ప‌ర్వ‌దినాల‌లో భాగంగా సెప్టెంబర్ 5న తిరుమల శ్రీవారి సన్నిధిలో శిక్యోత్సవం జ‌రుగుతుంద‌ని, 13న బలరామ జయంతి, వరాహ జయంతి నిర్వ‌హిస్తామ‌ని. 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగుతుంద‌ని టీటీడీ స్ప‌ష్టం చేసింది 15న శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం, 19న శ్రీవారి గరుడ సేవ. 20న శ్రీవారి స్వర్ణరథం, 22న శ్రీవారి రథోత్సవం, 23న తిరుమల శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణం, 24న శ్రీవారి బాగ్ సవారి, 25న అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం ఉంటుంద‌ని వెల్ల‌డించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి. .

Related News