శివ కార్తికేయ‌న్ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షురూ

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుల్లో శివ కార్తికేయ‌న్ ఒక‌రు. త‌న కొత్త ప్రాజెక్టు గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. శివకార్తికేయన్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఎస్కే27. ఈ నెల లోనే షూటింగ్ షురూ కానుంది. త‌న సినీ కెరీర్ లో ఇది 27వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు ‘పార్కింగ్’ వంటి విలక్షణమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌డం విశేషం.

ఈ చిత్రంలో శివకార్తికేయన్ ‘మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్’ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. రామ్‌కుమార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఇదొక పక్కా కమర్షియల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ లొకేషన్ల వేటలో (Location Hunt) బిజీగా ఉంది. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ కెమెరా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెలలోనే ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటుల అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.

  • Related Posts

    కోలీవుడ్ లో న‌న్ను ఘోరంగా అవ‌మానించారు : సూరి

    చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టుడు సూరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయట పెట్టాడు . నన్ను ఘోరంగా అవమానించి, నా చొక్కా విప్పేసి వేరే వ్యక్తికి ఇచ్చారని ఆవేద‌న వ్య‌క్తం…

    అట్లీ రాకా మూవీలో బ‌న్నీ మూడు పాత్ర‌లు..?

    హైద‌రాబాద్ : ఇప్పుడు అంద‌రి క‌ళ్లు అల్లు అర్జున్ రాకాపై ఉన్నాయి. దీనికి స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మూడు పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు టాక్. ‘పుష్ప’ సిరీస్ ఘనవిజయం తర్వాత అగ్రనటుడు అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాబోయే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *