Friday, 6 November 2026

తొలి రోజు రామాయణం కలెక్షన్లు రూ. 127 కోట్లు

newsseals-RaamaanCollections

హైద‌రాబాద్ : రామాయణ ఇతిహాసం ఇప్పటికే పలుమార్లు వెండితెరపైకి వచ్చింది. అయితే తాజాగా విడుదలైన ‘రామాయణం’ చిత్రం భారీ బడ్జెట్, అద్భుతమైన సెట్లు , ఆకట్టుకునే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం గురువారం నాడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు,ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విడుదల ముందు ఈ సినిమాపై పెద్దగా హడావిడి లేదు. కానీ, థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఈ ఇతిహాసాన్ని ఇంత భారీ స్థాయిలో తెర కెక్కించినందుకు చాలామంది ప్రేక్షకులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో యశ్ కనిపించిన తీరు, ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ప్రారంభ బాక్సాఫీస్ నివేదికల ప్రకారం ‘రామాయణం’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ. 127 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం హిందీ మార్కెట్ నుండే ఈ చిత్రం సుమారు రూ. 47.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఇతర భాషల్లో కూడా వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. కన్నడ వెర్షన్ సుమారు రూ. 7.25 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 6 కోట్లు వసూలు చేశాయి. తమిళ వెర్షన్ రూ. 2.60 కోట్లు, మలయాళ వెర్షన్ మరో రూ. 1.50 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన , దీపావళి సెలవు దినాలు దగ్గర పడుతుండటంతో రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *