ఛత్తీస్‌గఢ్ సీఎంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధాని న్యూఢిల్లీలో విష్ణు దేవ్ సాయి తో భేటీ అయ్యారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ ఎన్ఓసి కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి జారీ చేయాలని కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో ముంపునకు గురైన భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్ఓసితో, బ్యారేజీలో పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసే ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. దీనివల్ల లక్షలాది ఎకరాలకు సాగునీటి ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ముంపు కారణంగా ప్రభావితమైన భూములు, ఇళ్లకు తెలంగాణ పూర్తి నష్ట పరిహారం అందిస్తుందని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తద్వారా జలాశయంలో నీటి నిల్వను పూర్తిస్థాయికి పెంచి, ప్రాజెక్టు సాగునీటి ప్రయోజనాలను మరింతగా ముందుకు తీసుకెళ్తుందని ఆయన హామీ ఇచ్చారు. తమ రాష్ట్రంలోని రైతుల గురించి కూడా ఆలోచించాలని విన్నవించారు. ఇరు రాష్ట్రాల మధ్య గతంలో పలు దఫాలుగా చర్చలు జరిగినట్లు తెలిపారు. తమ ప్రాంతపు రైతుల ప్రయోజనాలు అత్యంత ముఖ్యమని, ఇందుకోసం మనసు మార్చుకుని ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు మరోసారి.