newsseals.com

ఆస్తుల కంటే బంధాలు ముఖ్యం : కియానూ రీవ్స్

September 6, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : త‌న‌కు పిల్ల‌లు ఎందుకు లేర‌నే విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ‌ హాలీవుడ్ సూపర్ స్టార్ కియానూ రీవ్స్ . నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నా దగ్గర 350 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ, నా అంతరాత్మలో మాత్రం తీవ్రమైన వేదన ఉంది. ఎందుకంటే ఇంతకాలం గడిచినా నేను పూర్తిగా నమ్మదగిన మహిళను ఎవరినీ కలుసు కోలేకపోయానని వాపోయాడు. నా గత బంధం నాకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది; నా డబ్బును ఎవరో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే భావన కలిగింది. ఆ చేదు అనుభవం కారణంగానే, ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవద్దని లేదా కుటుంబాన్ని ప్రారంభించ వద్దని నిర్ణయించుకున్న‌ట్లు తెలిపాడు కియానూ రీవ్స్.

నాతో జీవితాన్ని పంచుకోగలిగే, నేను నిజాయితీగా నమ్మదగిన వ్యక్తి దొరికే వరకు వేచి చూడటానికే నేను ఇష్టపడతాను అని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా కియానూ రీవ్స్ ప్రముఖ కెనడియన్ నటుడు.నిర్మాత, దర్శకుడు , సంగీతకారుడు. ఆయన ముఖ్యంగా The Matrixలో Neo పాత్రతో, John Wick సిరీస్‌లో John Wick పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు 2 సెప్టెంబర్ 1964 లో లెబ‌నాన్ దేశంలోని బీరూట్ లో పుట్టాడు. త‌న‌కు ప్ర‌స్తుతం 62 ఏళ్లు. ఆయన చిన్ననాటి కాలంలో కుటుంబంతో కలిసి న్యూయార్క్ కు వెళ్లాడు. ఆ త‌ర్వాత టొరంటోలో స్థిర‌ప‌డ్డాడు. 1999లో వచ్చిన The Matrix సినిమా ఆయన కెరీర్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. 2014లో జాన్ విక్ మూవీలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. తాజాగా కియానూ రీవ్స్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Related News