newsseals.com

అమెరికా పౌరుడితో ష‌ర్మిల కూతురు పెళ్లి

September 6, 2026 · VijayaBhaskar

అమెరికా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి వైఎస్ అంజ‌లి రెడ్డి త్వ‌ర‌లో ఓ ఇంటిదానిగా మార‌బోతోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన అమెరికా పౌరుడిని వివాహం చేసుకోనుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సామాజిక వేదిక ఎక్స్ వేదిక‌గా ఫోటో కూడా పంచుకుంది అంజ‌లి రెడ్డి. వైఎస్ షర్మిల కుమార్తె వివాహానికి అంతా సిద్ధమైంద‌ని తేలి పోయింది. తన కుమార్తె వైఎస్ అంజలి రెడ్డికి సోమల సుబ్బారెడ్డి కుమారుడైన డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ప్ర‌క‌టించారు.

కుటుంబ సభ్యులందరూ అమెరికా పౌరులే అయినప్పటికీ, ఈ కుటుంబాల మూలాలు కర్నూలు జిల్లాలోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని పంచుకుంటూ షర్మిల ఇలా అన్నారు. మా కుమార్తెకు సంబంధించిన ఈ శుభవార్తను పంచుకుంటున్నందుకు నా భర్త అనిల్ కుమార్ , నేను ఎంతో సంతోషిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అలాగే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. మా స్నేహితులు, శ్రేయోభిలాషులందరి ప్రార్థనలు , ఆశీర్వాదాలను తాము కోరుకుంటున్నామ‌ని తెలిపారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఈ సంద‌ర్బంగా ప‌లువురు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ , కుటుంబీకులు ష‌ర్మిలకు అభినంద‌న‌లు తెలియ చేశారు.

Related News