స్కేట‌ర్లు విశ్వంక్ తేజ్, ఇషాన్ తేజ్ ల‌కు ఎంపీ కంగ్రాట్స్

సికింద్రాబాద్ : మ‌ల్కాజిగిరి భారతీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ న‌గ‌రంలోని బోడుప్పల్ (చెంగిచెర్ల) ప్రాంతానికి చెందిన యువ స్కేటర్లు విశ్వంక్ తేజ్ , ఇషాన్ తేజ్ అనేక అవార్డులు, రికార్డులను సాధించినందుకు వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.రాములు-సంధ్య దంపతుల కుమారులైన వీరు ఇప్పటి వరకు సుమారు 60 అవార్డులను గెలుచుకున్నారు; ‘తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ‘ఖేలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించు కోవడం ఎంతో గర్వకారణం అని అన్నారు. రాబోయే రోజుల‌లో మ‌రిన్ని పుర‌స్కారాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు.

చిన్న వయసులోనే స్కేటింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచి మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకు రావ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. భవిష్యత్తులో జాతీయ , అంతర్జాతీయ స్థాయిలలో మరిన్ని విజయాలు సాధించి దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింప జేస్తారని ఆశిస్తున్నానని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. వారి ప్రతిభకు గుర్తింపుగా ‘ప్రధాన మంత్రి జాతీయ బాలల పురస్కారం-2026’ (Prime Minister’s National Child Award–2026) కోసం దరఖాస్తు చేసినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి , ఇతరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మెట్రోలో ప్రయాణించిన సీఎస్ సంజ‌య్ జాజు

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జజు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డితో కలిసి బేగంపేట నుండి ప్యారడైజ్ వరకు హైదరాబాద్ మెట్రో…

    అమెరికా పౌరుడితో ష‌ర్మిల కూతురు పెళ్లి

    అమెరికా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి వైఎస్ అంజ‌లి రెడ్డి త్వ‌ర‌లో ఓ ఇంటిదానిగా మార‌బోతోంది. క‌ర్నూలు జిల్లాకు చెందిన అమెరికా పౌరుడిని వివాహం చేసుకోనుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సామాజిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *